Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి
నవతెలంగాణ - షాద్‌నగర్ రూరల్
షాద్‌నగర్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలని ఫరూఖ్‌నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం డిప్యూటీ తహసిల్దార్‌కు జిల్లా సాధన సమితి నేతలు వినతిపత్రం అందజేశారు. షాద్‌నగర్ ప్రజలకు జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో గ్రామీణ నిరుపేద ప్రజలు వివిధ కార్యాలయాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం సరిగా లేదన్నారు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇందుకు షాద్‌నగర్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ఎమ్మె సంతోష్, కాసోజు శివ, మేకల మధు, గుండ్ల నవీన్, రాఘవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.