Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
గొర్రెల కాపరుల అభివద్ధికి ప్రభుత్వం కషి చేస్తుందని ఎన్సీడీ సీ ఈడీ ముఖేశ్ కుమార్, చీప్ డైరెక్టర్ భూపేందర్‌సింగ్, ఎన్సీడీసీ హైద్రాబాద్ ఈడీ శ్రీని వాసులు తెలిపారు. జాతీయ సహకార అభివద్ధి సంస్థ ఢిల్లీ ఆధ్వర్యంలో సోమవారం చేవెళ్ల మండలంలోని చేవెళ్ల, మీర్జాగూడ గ్రామంలో గొర్రెల కాపరుల సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గొర్రె కాపరుల అభివద్ధి పథకం కింద పంపిణీ చేసిన గొర్రెలు ద్వారా లబ్దిపొందుతున్న స్కీమ్‌లో ఇంకేమైనా మార్పులు చేయాలా గొర్రెల ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, సంచార పశు వైద్యశాల 1962 అందిస్తున్న సేవల గురించి గొర్రెల కాపరులను అడిగి తెలుసుకోగా, గొర్రెలకు తప్పనిసరిగా చెవిపోగులు వేయించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ చెవిపోగులు వేయించడంతో ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. గొర్రెలకు తప్పనిసరిగా పశు వైద్యుల సలహాలను పాటించి అధిక లబ్దిపొందాలని గొర్రెకాపారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ విజయ్‌కుమార్ రెడ్డి, కష్ణయ్య, డాక్టర్లు తిరుపతిరెడ్డి, పశు వైద్యులు డాక్టర్ శిరీష, శ్రీలత, జయసుధ, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు నర్సింలు, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.