Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
గొర్రెల కాపరుల అభివద్ధికి ప్రభుత్వం కషి చేస్తుందని ఎన్సీడీ సీ ఈడీ ముఖేశ్ కుమార్, చీప్ డైరెక్టర్ భూపేందర్‌సింగ్, ఎన్సీడీసీ హైద్రాబాద్ ఈడీ శ్రీని వాసులు తెలిపారు. జాతీయ సహకార అభివద్ధి సంస్థ ఢిల్లీ ఆధ్వర్యంలో సోమవారం చేవెళ్ల మండలంలోని చేవెళ్ల, మీర్జాగూడ గ్రామంలో గొర్రెల కాపరుల సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గొర్రె కాపరుల అభివద్ధి పథకం కింద పంపిణీ చేసిన గొర్రెలు ద్వారా లబ్దిపొందుతున్న స్కీమ్‌లో ఇంకేమైనా మార్పులు చేయాలా గొర్రెల ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, సంచార పశు వైద్యశాల 1962 అందిస్తున్న సేవల గురించి గొర్రెల కాపరులను అడిగి తెలుసుకోగా, గొర్రెలకు తప్పనిసరిగా చెవిపోగులు వేయించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ చెవిపోగులు వేయించడంతో ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. గొర్రెలకు తప్పనిసరిగా పశు వైద్యుల సలహాలను పాటించి అధిక లబ్దిపొందాలని గొర్రెకాపారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ విజయ్‌కుమార్ రెడ్డి, కష్ణయ్య, డాక్టర్లు తిరుపతిరెడ్డి, పశు వైద్యులు డాక్టర్ శిరీష, శ్రీలత, జయసుధపౌరుల ప్రాథమిక హక్కులు కాపాడటం కోర్టుల ప్రథమ బాధ్యత
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
భారత రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక హక్కులు ఉంటాయని వాటిని కాపాడటం కోర్టుల ప్రథమ బాధ్యత కొడంగల్ న్యాయమూర్తి ఎం భాస్కర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సంగమేశ్వర భక్త సమాజం ఆవరణలో బొంరాస్ పేట్ సర్పంచ్ జయమ్మ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన వేదిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొడంగల్ జస్టిస్ ఎం. భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై యువకులకు, గ్రామస్తులకు చట్టాలపై అవగహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముక్యంగా రాజ్యాంగబద్ధంగా నేర, పౌర సంబంధిత అంశాలు కోర్టు పరిగణలోకి తీసుకుంటుందన్నారు. చట్టానికి అనుగుణంగా వ్యవహరించిన వారికీ న్యాయం జరుగు తుందన్నారు. గ్రామాల్లో అప్పులు ఇచ్చి తీసు కోవడంలో ప్రంసారి నాట్ కీలకమేమి కాదని తెల్ల కాగితంపై 1రూపాయి స్టాంప్ అతికించినా కోర్టులో చెల్లుతుందన్నారు. భూముల కేసుల విషయంలో పోలీసుల పాత్ర ఉండదని వాటిపై కోర్టునే అశ్రయించాలని సూచించారు. 100 రూపా యలు పైబడి స్థిరాస్తులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలనీ, వాటిని మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందన్నారు. సదా బైణామాలు చెల్లవన్నారు. మండల ప్రజలు న్యాయ సలహాల కోసం తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో, న్యాయవాదులను నుంచి సలహాలు పొందవచ్చని సూచించారు. చిన్న చిన్న కేసులు రాజీ పడేందుకు లోక్ అదాలత్‌ను సద్వి నియోగించుకోవాలన్నారు. యువకులు సన్మా ర్గంలో నడిచి నేరారహిత సమాజాన్ని నిర్మించాలని అయన కోరారు. కార్యక్రమంలో సీఐ అప్పయ్య, బార్ కౌన్సీలర్ ప్రెసిడెంట్ సుధాకర్‌రెడ్డి, న్యాయవాదులు భీమయ్య, ఆనంద్, సంతోష్, ఎస్ఐ వెంకట్ నారాయణ, ఏ ఎస్ఐ రాములు, పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య,గ్రామస్తులు నర్సిములు గౌడ్, పొట్ట రామకృష్ణ, మధు, యువకులు పాల్గొన్నారు.
, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు నర్సింలు, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.