Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వెంటనే ప్రమోషన్లు, బదిలీలు చేపట్టి, టీఆర్టీ 2017 అభ్యర్థులకు తక్షణం పే ప్రొటక్షన్ అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ టీఎస్ యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి బందెప్ప అన్నారు. సోమవారం కొడంగల్ మండలంలోని కస్తూరిపల్లి, రావులపల్లి, ఇందనూరు, అంగడి రాయ్‌చూర్, రుద్రారం, నాగారం తదితర పాఠశాల్లో పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేండ్లుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా, టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికి టీఎస్ యూటీఎప్ సిద్ధంగా ఉందనీ, ఈ ఉద్యమాల్లో ఉపాధ్యాయులందరూ కలిసి ముందుకు రావాలని కోరారు.ప్రభుత్వం విద్యాశాఖకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సాక్షాత్తు సీఎం కేసీఆర్ శాసనసభలో ఇచ్చిన వాగ్దానాన్ని కార్యరూపంలో పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో ప్రమోషన్లు లేక ఓకే క్యాడర్ల్లో వేల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులు ఆర్థిక నష్టం, భరిస్తూ రిటైర్ అవున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే కదిలి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు వెంటనే చేపట్టాలని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను తక్షణమే బదిలీ చేయాలన్నారు. 2017 ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీ 2020లో జరిగిన నష్టాన్ని పే ప్రొడక్షన్ ద్వారా రక్షణ కల్పించాలని తెలిపారు.కార్యక్రమంలో కొడంగల్ అధ్యక్షులు బసప్ప, ప్రధాన కార్యదర్శి నర్సింగ్,మండల నాయకులు అశోక్ కుమార్, ముత్యప్ప, బాల్‌రాజ్, నరేందర్ తదితరులున్నారు.