Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ప్రజలు ధరణి భూ సమస్యలతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అన్నారు.సోమవారం ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ప్రతీ సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు 'డయల్ ఇన్ గ్రీవెన్స్' కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుంచి వివిధ సమస్యలపై (23) ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరిస్తామన్నారు. ప్రజలు ధరణి భూ సమస్యలతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కరించుకోవాలని సూచించారు. పంచాయతీ రాజ్, ఉపాధి హామీ, పారిశుధ్యం, మున్సిపల్ సమస్యలు, మిషన్ భగీరథ, తాగునీటి సమస్యలు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఎరువులు, నకిలీ విత్తనాలు, సంక్షేమ శాఖల సమస్యలు, పశుసంవర్ధక తదితర శాఖలకు సంబంధించిన అన్ని సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేసిన వెంటనే పరిష్కరిస్తామన్నారు.
ధరణి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రతి బుధవారం కూడా ఉ. 9:30 నుంచి 10:30 వరకు 'డయాల్ ఇన్ గ్రీవెన్స్' కార్యక్రమం నిర్వహిం చను న్నట్టు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.
అనంతరం గత వారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులపై శాఖల వారిగా తీసుకున్ని, పరిష్కార చర్యలపై సమీక్షించారు. అన్ని సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కరించి గ్రీవెన్స్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, వికారాబాద్ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.