Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం
నవతెలంగాణ-మోమిన్‌పేట్
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తి బలైన ఘటన మోమిన్‌పేట్ మండలంలోని మొరంగపల్లి రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన ప్రకారం మొరంగపల్లి గ్రామానికి చెందిన పులిగారి శ్రీని వాస్ (39) వ్యవసాయం చేసుకునే వాడు ఈ రోజు ఉద యం 8.30 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకోవ డం కోసం బయటకు వెళ్లాడు. వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వికారాబాద్ నుంచి సదాశివపేటకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైకును ఢకొీట్టింది. శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని అం బులెన్స్ ద్వారా సదాశివపేటలోని ఆస్పత్రికి తరలించా రు. అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. మృతుడి బార్య జేయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శేఖర్‌గౌడ్ తెలిపారు.