Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీిస్ఐఐసీ చైర్మన్ బాల మల్లు
- పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి
- చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు జి. రంజిత్‌రెడ్డి
నవతెలంగాణ-పూడూర్
పారిశ్రామిక వాడగా రాకంచెర్ల అభివృద్ధి చెందుతుందని టీస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు అన్నారు. సోమవారం పూడూరు మండల పరిధిలోని రాకంచెర్ల ఇండిస్టియల్ పార్క్‌ను సందర్శించి పరిశ్రమలకు ఏర్పాటు గల వివరాలను అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల తో మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి రాకంచెర్ల ఇండిస్టియల్ పార్కు పరిశ్రమలు ఏర్పడితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడి ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న పారిశ్రామిక వాడలను ఇక్కడి ప్రాంతానికి తీసుకువచ్చే ఆలోచన ప్రభుత్వాధికారులు చేయాలని, హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిశ్రమలకు సంబంధిత అధికారులకు ఆదేశించారు.
పరిశ్రమలతో ఈ ప్రాంతం అభివృద్ధి : ఎంపీ రంజిత్ రెడ్డి
హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న రాకంచెర్ల ఇండిస్టియల్ పార్కు ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొ ల్పితే ఇక్కడ యువతకు ఎంతో ఉపా ధి అవకాశాలు లభిస్తాయని ఈ ప్రాం తం మరింత అభివృద్ధి చెందే అవకా శం ఉంటుందని చేవెళ్ల ఎంపీ రంజి త్‌రెడ్డి అన్నారు. నగర శివార్లలో ఉన్న పరిశ్రమలను వెంటనే ఈ ప్రాంతానికి తీసుకు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవా లన్నారు. ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు నెలకొ ల్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, టీఎస్ ఇండిస్టియల్ ఎండీ నరసింహారెడ్డి, జడ్పీటీసీ మేఘ మాల ప్రభాకర్ గుప్తా, సొసైటీ మాజీ చైర్మన్ నరసిం హారెడ్డి, సర్పంచ్ కమ్లిబయి పెంటయ్య, డిప్యూటీ సర్పంచ్ రాజేందర్, పూడూరు ఎస్ఎంసీ చైర్మన్ తాజో ద్దీన్, కార్మిక విభాగం మండలాధ్యక్షుడు కె. హరీశ్వ ర్‌రెడ్డి, వార్డు సభ్యులు జంగన్న, నాయకులు తిక్కల సాయన్న, తదితరులు పాల్గొన్నారు.