Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపాదనలు సరిగ్గా లేనందునే పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం
- త్వరలో పనులు ప్రారంభిస్తాం
- తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వార్డు పర్యటన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రె డ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 17, 18వ వార్డులో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమ స్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో గల్లీగల్లీలో తిరిగారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే గతంలో ఇచ్చిన హామీ మేరకు పాత తాండూరులో అర్బన్ హాస్పిటల్ మంజూరు అ యిందని అన్నారు. వార్డుల్లో దీర్ఘకాలిక సమస్యలు గుర్తించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కోసం మంత్రి కేటీ ఆర్కు విన్నవించి సదుపాయాలు కల్పించేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కా రానికి కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఇది ప్రజలపై ఉన్న వారి చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. అటకం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. తాండూరు మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మురళీ కృష్ణగౌడ్, ఆర్డీఓ అశోక్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా న ర్సింలు, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, వెంకట్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఆయా వార్డుల కౌన్సిలర్ లు, నాయకులు డాక్టర్ సంపత్, రాజు గౌడ్, నయ్యుం అఫు, నర్సింలు, శ్రీనివాస్ చారి, బంట్వరాం సుధాకర్, నర్సిరెడ్డి, నయూం ఖాన్, గుండప్ప, సంజు, హరిహరాగౌడ్, సంతోష్ గౌడ్, సమధ్, మోయిజ్, అనిల్ బౌండ్ తదితరులు పాల్గొన్నారు.