Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని నులిపురుగుల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఉమాదేవి కోరారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమాదేవి మాట్లాడుతూ మండల పరిధిలోని 15,769 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మందు పంపిణీ చేసినట్టు తెలిపారు. 2 - 19 ఏండ్ల పిల్లలందరికీ నిలిపురుగుల మందు తప్పనిసరిగా వేయాలని సూచించారు. ఈ నివారణ మందును మండలంలో మొత్తం 36 కేంద్రాల ద్వారా పిల్లలకు అందించనున్నట్టు వివరించారు. ఈ కేంద్రాల ద్వారా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఈ నులిపురుగుల నివారణ మందు పంపిణీ పిల్లలకు అందజేస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.