Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ గౌరవరం పద్మా రెడ్డి
నవతెలంగాణ-మాడ్గుల
57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు ఎంపీపీ గౌరారం పద్మారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దొడ్ల పహాడ్ గ్రామపంచాయతీని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న అభివద్ధి పనులను గ్రామ సర్పంచ్ గజ్జె విజయ నిరంజన్ గౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ సమీపంలోని మీసేవ కేంద్రంలో ఓటర్ ఐడీ కార్డు లేదా టీసి, జనన ధ్రువీకరణ పత్రంతో పాటు బ్యాంకు పాస్ పుస్తకం, ఆదార్ కార్డు,నిర్దేశించిన దరఖాస్తు ఫారం, పాసుపోర్టు సైజ్ ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వద్ధాప్య పింఛన్ల దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31వ తేదీ వరకూ చేసుకోవచ్చని తెలిపారు.భార్యభర్తలు ఇరువురిలో ఒకరికి మాత్రమే వద్ధాప్య పింఛను వర్తిస్తుందన్నారు.ఒకవేళ ఇద్దరు దరఖాస్తు చేసుకున్నట్లయితే వెరిఫికేషన్‌లో ఒకరికి మాత్రమే మంజూరు చేయనున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిరంజన్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వెలుగు భానుశ్రీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.