Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా సంయుక్త కార్యదర్శి సాయి బాబా
నవతెలంగాణ -కొత్తూరు
సెప్టెంబర్ 6న నిర్వహించే తలపెట్టిన ఆశావర్కర్ల చలో కలెక్టరేట్ కార్యక్రమం విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా సంయుక్త కార్యదర్శి సాయిబాబు అన్నారు. ఆయన గురువారం ఆశావర్కర్లతో కలిసి మండల వైద్యాధికారి డాక్టర్ కవితకు ముందస్తుగా వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం పీఆర్సీని వెంటనే అమలు చేసి అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నవనీత, ఇంద్ర, వసంత, బుజ్జి, అనిత, మనిల, జహంగీర్ బి, మహేశ్వరి పాల్గొన్నారు.