Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మర్పల్లి
దేశంలో అడ్డూ అదుపు లేకుండా పెంచుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్, మైనార్టీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఖలిమోదిన్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటినుండి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. రెండేండ్లుగా ఓవైపు కరోనాతో ప్రజలు సతమతమవుతుంటే రోజురోజుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ పేదల నడ్డివిరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిఖిల్ రెడ్డి, నర్సింలు, అశోక్, సాయి పటేల్, సురేష్ యాదవ్, వెంకట్, బలవంత రెడ్డి, సోఫీ, సతీష్, రమేష్, ప్రశాంత్, వెంకటేష్, పాండు పాల్గొన్నారు.