Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్నూరు కాపు సంఘం
మండల అధ్యక్షుడు చేవేళ్ల ప్రసాద్
నవతెలంగాణ-శంషాబాద్
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని శంషాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు చేవేళ్ల ప్రసాద్ అన్నారు. మున్నూరు కాపు సంఘం నాయకులతో కలిసి గురువారం శంషాబాద్ తహసీల్దార్ జనార్దన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తం ఆదేశాల మేరకు తహశీల్దార్లకు రాష్ట్ర వ్యాప్తంగా వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం కొనసాగిస్తున్న మున్నూరుకాపులు పారిశ్రామికకరణ, ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూముల వల్ల స్వయం ఉపాధి కోల్పోయారని తెలిపారు. వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యికోట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు రాజేంద్రనగర్ మండల కన్వినర్ ఆవుల శ్రవణ్‌కుమార్, చేవేళ్ల వేణుగోపాల్, బి.దేవేందర్, ముత్యాల వీరేశం, ముత్యాల సురేష్, కంది ప్రభాకర్, మల్చలం నరేష్, చెంగలి అనిల్‌కుమార్, లింగం దామోదర్, చెంగలి సందీప్, ఆవుల మహేష్, ఆవుల నవీన్ ఆవుల అను, సీహెచ్ వెంకట రవితేజ పాల్గొన్నారు.