Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నవాబ్‌పేట్
టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను పురస్కరించుకుని నవాబ్‌పేట్ మండలం పూలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు జీ ప్రశాంత్ గౌడ్ గురువారం పార్టీ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా ముందుకు వెళ్తుందన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా టీఆర్ఎస్ నిలుస్తుదని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలు ఆకర్షితులయ్యేలా పథకాలు కొనసాగుతున్నాయని, అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా పార్టీ కృషి చేస్తున్నదని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో పార్టీ కార్యకర్తలు అహర్నిశలు కషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలే రవికాంత్, సర్పంచ్ నరసింహారెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకట్ రామ్‌రెడ్డి, మహేందర్ రెడ్డి, జంగయ్య, నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.