Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ కె నిఖిల
నవతెలంగాణ -వికారాబాద్ కలెక్టరేట్
జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద ఏఎన్ఎం, ఆశావర్కర్లను ఏర్పాటు చేసి రోజూ విద్యార్థులకు ఫీవర్ చెక్ చేయాలని కలెక్టర్ నిఖిల జిల్లా వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం డీపీఆర్సీ భవనంలో జిల్లా అధికారులతో శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలలో థర్మల్ స్కానర్ ఉంచాలని, ప్రతి విద్యార్ధికి గేట్ వద్ద ఫీవర్ చేసి కోవిడ్‌ను నియంత్రించాలన్నారు. జ్వరం ఉన్న విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించి, లక్షణాలుంటే ఐసొలేషన్ చేయాలన్నారు. జిల్లాకు మంజూరైన ఆర్టీపీసీఆర్ సెంటర్‌ను రెండు రోజులలో ప్రారంభించేం దుకు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ, ఎన్ఆర్ఈజీ ఎస్ నిధులతో వీటిని కొనుగోలు చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్‌కు రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలోని 1,196 చెరువులు, ప్రాజెక్టుల కింద ఆయకట్టు పూర్తి వివరాలను అందించాలన్నారు. జిల్లాలో గొర్రెల పెంపకం కొరకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు అందేలా చూడాలన్నారు.
అధికారులు రోజు వారీగా చేపట్టిన పనులను వాట్సాప్‌కు పంపించాలని ఆదేశించారు. అనంతరం విద్యుత్, హార్టికల్చర్, మైన్స్ తదితర శాఖలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.