Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభివృద్ధి సంక్షేమ కేసీఆర్ లక్ష్యం
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఘనంగా టీఆర్ఎస్ జండా పండగ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పార్టీ అభివృద్ధి కోసం అంకిత భావంతోపని చేసే వారికే పార్టీ పదువులు కట్టబెడతామని ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్ లక్ష్యమని గుర్తు చేశారు. పార్టీ జండా పండగను పురష్కరించుకుని ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై జండావిష్కరణ చేశారు. అనంతరం ఎస్సీ బస్తీల్లో జండావిష్కరణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 20వ తేదీ వరకు వివిధ హౌదాల్లో సంస్థాగత పార్టీ నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. గ్రామ, వార్డు, మున్పిపల్, మండల స్థాయి కమిటీలతోపాటూ, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. పార్టీ పదవులను అలంకారప్రాయంగా కాకుండా, నిబద్ధతతో, పార్టీ కోసం పని చేసేటోళ్లకే పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో అత్యధికంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచే పదువులు సాధించుకునేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 70 లక్షల మంది సభ్యత్వ కలిగిన పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఎస్సీలకు పెద్దపీట వేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేష్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతిచందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, పార్టీ అధ్యక్షులు చీరాల రమేష్, రమేష్‌గౌడ్, జడ్పీటీసీ జంగమ్మ, మాజీ చైర్మన్ కంబాలపల్లి భరత్‌కుమార్ తదితరులు ఉన్నారు.