Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాల్య వివాహాలు అంటరానితనం నేరం
100 డయల్ అందరికీ ధీమా
నవతెలంగాణ-మర్పల్లి
ప్రజలు యువత ప్రాణాంతకమైన కరోనా వైరస్, మద్యపానం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వెంకట్ శ్రీను, ఏఎస్ఐ సంజీవ రావులు అన్నారు. జిల్లా ఎస్పీ నారాయణ ఆదేశానుసారం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో గురువారం వికారాబాద్ జిల్లా పోలీస్ కళాబందం పలు అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాంతకమైన కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ మాస్క్ ఉపయోగిస్తూ వైరస్ను అరికట్టాలన్నారు. డ్రంక్ యువత మద్యానికి బానిసై విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అన్నారు. గ్రామాల్లో మద్యనిషేధం విధించుకుంటే ప్రశాంత వాతావరణం నెలకొంటుందన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలు దొంగతనాలు అదుపులోకి వచ్చాయన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు చేసినా ప్రోత్సహించిన చట్టప్రకారం శిక్షలు తప్పవన్నారు. ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా ఉంటూ ప్రజల రక్షనే ధ్యేయంగా పని చేస్తున్నట్టు తెలిపారు. అత్యవసర సమయాల్లో 100కు ఫోన్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లయ్య ప్రజలు యువకులు పోలీసులు పాల్గొన్నారు