Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్
నవతెలంగాణ- జిల్లేడు చౌదరిగూడెం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా అలుపెరగని పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించి తెలంగాణ జాతిపితగా సీఎం కేసీఆర్ నిలిచారని కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. గురువారం మండలంలోని తుంపల్లి, చౌదరిగూడెం, పద్మారంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్షాలు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు పటించుకునే స్థితిలో లేరని తెలిపారు. తెలంగాణలో అన్నిగ్రామలకు అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. షాదనగర్ నియోజక వర్గంలో అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఫరూఖ్‌నగర్ జడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, ఎంపీపీలు మధుసూధన్ రెడ్డి, ఇదిరిస్ అలీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, సర్పంచులు సంఘం మండల అధ్యక్షుడు బాబురావు, నాయకులు కొండి యాదయ్య, మణయ్య, దూలెయ్య, రామచంద్రయ్య, శంకరప్ప, యాదయ్య, మల్లేష్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.