Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలపై లేదా మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ నర్సింహా
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు కమిషన్లపై ఉన్న శ్రద్ధ చేపపిల్లల ఉత్పత్తిపై లేకపోవడం విడ్డూరంగా ఉందని మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ. నర్సింహ అన్నారు. జిల్లా కమిటీ అధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని జిల్లా అధ్యక్షులు చనమోని శంకర్, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు రావనమోని రాజు, పొన్నల బిక్షపతి, జోర్క నగేష్, చనమోని గోపితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో సుమారు 102 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలున్నాయన్నారు. ఈ సోసైటీలకు చేప పిల్లలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. కానీ జిల్లాలో ఒక్కటే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఉందని అది కూడా కేవలం 3లక్షల చేప పిల్లల ఉత్పత్తి చేస్తున్నామని అధికారులు చేప్పుతున్నారన్నారు. అది ఒక సోసైటికి కూడా సరిపోదన్నారు. మత్స్యకారులకు