Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొదట టీఆర్ఎస్ బలహీనంగా ఉన్నప్పటికీ.. రెండోవ దఫా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి కొంత పుంజుకుంది.. 2018 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నుంచి పోటిచేసి గెలుపొందిన ముగ్గురి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి లాక్కోవడంతో రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్కు తీరుగు లేకుండాపోయిందని ఊహించిన అధిష్టానానికి జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు పెద్దతల నొప్పిని తెచ్చి పెడుతున్నాయి. అసంతృప్తుల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఇన్నాళ్ల అంతర్గ పోరు కాస్తా.. జెండా పండుగతో బహిర్గతమైంది. గ్రామ స్థాయి నుంచి గ్రూపు రాజకీయాలు తెరమీదికి వచ్చాయి.
ఎవరి గ్రూప్ వారిదే
జిల్లాలో ఒకట్రెండు నియోజకవర్గాలు తప్ప అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరి వర్గానికి చెందిన వారు నాయకత్వం వహించి జెండా పండుగలు నిర్వహించారు. ఎంతో కాలంగా ఉప్పు.. నిప్పు అన్నట్టు ఉంటున్న తాండురు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గం.. మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డిలా వర్గం ఎవరికి వారే జెండాలు ఎగురవేశారు. నిత్యం ప్రతి కార్యక్రమంలో కలిసి తిరుగుతున్న మహేశ్వరం నియోజకవర్గంలో కూడా అంతర్గత విబేధాలు పెల్లుబికడంతో గ్రూపుల వారిగా కార్యక్రమాలు నిర్వహించారు.. ఇక్కడ టీడీపీ నుంచి వచ్చిన టీఆర్ఎస్ గ్రూప్.. కాంగ్రెస్ నుంచి వచ్చిన టీఆర్ఎస్ గ్రూపుల మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది.. ఎవరి జెండా వారిది అన్నట్టు వర్గ పోరు కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఇక రాజేంద్రర్నగర్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగెది నీనే అంటూ ఇటు స్ధానిక ఎమ్మెల్యే.. అటు మంత్రి కుటుంబం పోటా పోటిగా నియోజకర్గాన్ని చుట్టేస్తున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు...2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిచెందిన రామోహన్గౌడ్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న పరిస్థితి.. ఇరువర్గాల మధ్య ఎంతో కాలంగా నడుస్తున్నప్పటికీ..టీఆర్ఎస్ పార్టీ జెండా అవిష్కరణ కార్యక్రమంతో నియోజకవర్గ ప్రజలకు బహిర్గతమైంది. నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్లు అందరు పార్టీ ఇన్చార్జి.. ఆయా డివిజన్ల ఇన్చార్జీలను ఖాతర్ చేయకుండా స్వయంగా తమ వర్గంతో జెండా అవిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు.. మన్సురాబాద్ డివిజన్లో మాజీ కార్పొరేట్ వర్గం.. డివిజన్ ఇన్చార్జి వర్గం నాయకులు వేరు వేరుగా జెండాలు ఎగరవేస్తూ.. పార్టీలో ఉన్న అంతర్గ విబేధాలకు సంకేతాలు ఇచ్చారు..
ప్రతిపక్షాలకు ఊరట..
టీఆర్ఎస్ అధినాయకత్వం చేపట్టిన జెండా పండుగతో ఆ పార్టీలో ఉన్న వర్గపోరు బహిర్గతమవుతుండటంతో.. విప క్షాలకు ఊరట కలిగింది. గులాబీలో అసం తృప్తులను తమ పార్టీలోకి అహ్వానించేందుకు ఇప్పటికే.. రాయబారాలు చేస్తున్న ఆయా పార్టీలకు మరింత అవకాశం దొరికిందన్నట్టు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. టీఆ ర్‌ఎస్‌లో వర్గపోరు... పార్టీని పెనుప్ర మాదంలోకి నెట్టనున్నట్టు రాజకీయ నిపుణులు వాదాన.