Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల ప్రత్యేక అధికారి అనిత, ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని కరోనాను అరికడదామని మండల ప్రత్యేక అధికారి అనిత, ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రం తో పాటు కోటమర్పల్లి సబ్ సెంటర్లను వారు పరిశీ లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాంత కమైన కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని కరోనా రహిత మండలంగా మార్చుకుందాం అన్నారు.
మండలంలో667 మందికి వ్యాక్సిన్
మండలంలోని భూచనపల్లిలో102 మందికి, ఘన పూర్లో 48 మందికి, కల్కూడలో 22 మందికి, కొంష ట్పల్లిలో 60 మందికి, కోట్ మర్పల్లిలో 70 మందికి, కోత్లపు రంలో 94 మందికి, మర్పల్లిలో 90 మందికి, పట్లూర్లో31 మందికి, సిరిపురంలో 70 మందికి, తుమ్మలపల్లిలో 80 మందికి వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేసినట్లు వారు తెలిపారు.