Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చౌదర్ గూడా గ్రామ సర్పంచ్ కటికల రాజ్‌కుమార్
గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు
నవతెలంగాణ-శంషాబాద్
అంగన్వాడీ కేంద్రం అభివృద్ధికి చర్యలు తీసుకుంటా నని మండల పరిధిలోని చౌదరిగూడ గ్రామ సర్పంచ్ కటికల రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం గ్రామంలో గర్భిణీలకు తన సొంత ఖర్చులతో సామూహిక శ్రీమంతాలు నిర్వహించి చీరలు పండ్లు ఫలాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గర్భిణులు సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని అన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కళమ్మ, పంచాయతీ కార్యదర్శి షమీం సుల్తానా, నర్కూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దివ్య, వార్డు సభ్యులు పొగాకు మహేశ్వరి, బక్క భారతమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ సరళ, అంగన్వాడీ టీచర్ అమూల్య, ఆశావర్కర్లు కలమ్మ, అమృత, సహాయకులు యాదమ్మ, మంజుల, మానస, సిబ్బంది రాకేష్, అర్జున్ సంతోష తదితరులు పాల్గొన్నారు.