Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
బండారి రవి కమార్
నవతెలంగాణ-మియాపూర్ ( గచ్చిబౌలి)
తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవి కుమార్ అన్నారు. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వ ర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిందన్నారు. వారసులు ఒక కమ్యూనిస్టులు మాత్రమేనని గుర్తు చేశారు. ఆనాటి ని జాంకు వ్యతిరేకంగా కూడు, గూడు గుడ్డ లేని అతి సామాన్య ప్రజానీకం నుంచి కవులు, కళాకారులు విద్యార్థులు మేధా వులు ప్రతి ఒక్కరూ పోరాటం నిర్వహించాలని గుర్తు చేశా రు. దొడ్డి కొమురయ్య తెలంగాణ మొదటి అమరత్వంతో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ పటేల్ మిల్ట్రీ దాడి చేసి భారతదేశంలో విలీనం చేసుకునే వరకు కమ్యూనిస్టులు మాత్రమే తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నారని అన్నారు. బీజేపీకి, ఆర్ఎస్ఎస్ శక్తులకు తెలం గాణ సాయుధ పరాటానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు పూసే కుట్ర బీజేపీ చేస్తుందని కేవలం హిందూ, ముస్లిం ల మధ్య గొడవగానే ఈ పోరాటాన్ని చిత్రీకరించే ప్రయత్నం చే స్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం నవాబుకు వ్యతిరే కంగా పోరాటం చేసిన ముస్లిం నాయకులు అందరూ ఉన్నారని అందులో ముద్దం మోహిన్, షోయబుల్లాఖాన్, షే క్ బందగి తదితర నాయకులు నిజాంకు వ్యతిరేకంగా పోరా టంలో ముందున్నారు. వీరే కాకుండా గ్రామీణ ప్రాంతంలో అనేక మంది ముస్లిం యువత నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించిన వారిలో ఉన్నారని తెలిపారు. చరిత్ర లేని పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో అది కేవలం బీజేపీ మాత్రమేనని తెలిపారు. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్న బీజేపీ నేడు భారత దేశంలోని అనేక మూల స్తంభం లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ చేతగానితనం వల్ల రాష్ట్రంలో బీజేపీ రాజకీ యాలు చేస్తోందని ఇప్పటికైనా, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలం గాణ విలీన దినాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) శేర్లింగంపల్లి నా యకులు శోభన్, కృష్ణ, సాంబశివరావు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం సిబ్బంది విజరుకుమార్, అనిల్, రవీందర్, నాగరాజ్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.