Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరు యాత్ర
టీఆర్ఎస్ ప్రభుత్వంలో అలజడి మొదలైంది
కాంగ్రెస్ షాద్‌నగర్ నియోజకవర్గ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తలపెట్టిన దళిత గిరిజ న దండోరా ముగింపు సభను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయగా నియోజకవర్గ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో వివిధ మండలాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. శుక్రవారం వీర్లపల్లి నివాసం నుంచి బయలుదేరి పట్టణ ముఖ్య కూడలిలోని అంబెడ్కర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరంతర పోరాటాలు చేస్తామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆశయాలను ఆకాంక్షలను టీఆర్ఏస్ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. కేసీఆర్ నియంత పాలనపై అమరుల ఆత్మలు గోషిస్తున్నాయని అన్నారు. ఎన్నికలు సీట్లు అధికారం కోసం కేసీఆర్ ఆరాటపడుతున్నారని అన్నారు. ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటే అక్కడ నిధుల మంజూరు భారీ గా ఉంటుందని, అదే కోణంలో హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపు కోసం దళిత బంధును తెచ్చారని మండిపడ్డారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళితుల ఓట్లను దండుకునేందుకే వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తూ దళిత బంధు తెచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని బం ధులు తెచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, టీఆర్ఏస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. అమరుల ఆశయాలను, ఆకాంక్షలను విస్మరించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఇటీవల తీసుకొచ్చిన దళితబం ధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం భారీ వాహనం ర్యాలీతో గజ్వేల్ దళిత గిరిజన దండోరా సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ బాబర్‌ఖాన్, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, కుమారస్వామిగౌడ్, ఎంపీటీసీ శ్రీశైలం, పట్టణ అధ్యక్షుడు కె.చెన్నయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు గౌడ్, జగదీష్ అప్పా, ఫరూక్నగర్ మండల అధ్యక్షుడు ఆశన్నగౌడ్, నందిగామ మండల అధ్యక్షుడు జంగా నరసింహ, కేశంపేట మండల అధ్యక్షుడు విరేష్, కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చౌదరిగూడెం మండల అధ్యక్షుడు రాజు, కొత్తూరు మండల అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, జితేందర్ రెడ్డి.యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందే మోహన్, కదీర్, మసూద్‌ఖాన్, శీను నాయక్, చందు నాయక్, సుదర్శన్, పులిమామిడి రాజేష్, బచ్చలి రమేష్, గోదా మాధవులు. చౌదర్గూడా ఆంజనే యులు, యాదయ్య, బుడ్డ నరసింహ, లింగారెడ్డి గూడా అశోక్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.