Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-కొత్తూరు
దళితబంధు పథకాన్ని హుజురాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తూరు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, డిప్యూటీ తహసీల్దార్ వెంక్రటాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న సీఎం కేసీఆర్ నేడు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా దళితులను మోసం చేశారని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని హామీనిచ్చి అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. రైతుబంధు పథకం లాగే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. ఉపఎన్నికలు వస్తాయనే నెపంతో దళితబంధు పథకాన్ని హడావిడి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఎన్నికలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో లబ్దిదారుల ఎంపికను మరుగున పడేశారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో కొత్తూరు మున్సిపల్ కౌన్సిలర్లు మాదారం నరసింహ గౌడ్, సోమ్లా నాయక్, కాంగ్రెస్ నాయకులు జె. శ్రీనివాస్ గౌడ్, పీర్ల గూడెం గోపాల్ గౌడ్, మోర జనార్ధన్ రెడ్డి, కుమ్మరి లక్ష్మయ్య, మాదారం కృష్ణగౌడ్, కర్రోళ్ళ సురేందర్, మహమ్మద్ సద్దాం, ఉట్ పల్లి నరసింహా, సత్యం, కొండారెడ్డి, విష్ణుమూర్తి, యాదయ్య గౌడ్, ఎం పరంధాములు, పులిమామిడి శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.