Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోమిన్‌పేట
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాల నియంత్రించొచ్చని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారా యణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పాత కోల్కోంద గ్రామంలో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని నేర ప్రవత్తిని, అసాంఘిక కార్యకలాపాలకు అడు ్డకట్టవేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దాత శ్రీనివాస పౌల్ట్రీ ఫామ్ యజమాన్యాలను అభి నందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామాల్లో ఎలాంటి ఘటనలు జరిగినా , నిందితులను గుర్తించడా నికి పోలీసులకు సులువుగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రషీద్, డీఎస్పీ సంజీవరావు, సిఐ వెంకటేశం, సర్పంచ్ కొన్నింటి సురేష్, ఎస్ఐ శేఖర్ గౌడ్, ఎంపీటీసీ శ్రీదేవి భుజంగం, ఉపసర్పంచ్ యాదయ్య, కార్య దర్శి సుమిత్ర, వార్డు సభ్యు లు గ్రామస్తులు అశోక్, సిద్దన్న, ఖాజా పాషా , బస్వరాజ్ , మల్లప్ప, చెన్నా రడ్డి, ప్రవీణ్ , తదితరులు పాల్గొన్నారు.