Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో రైతు వ్యతిరేక చట్టాలు విరమించుకునే వరకూ పోరా డుదామని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి మధు సూదన్ రెడ్డి పిలుపునిచ్చారు.. శుక్రవారం యాచారం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సీపీఐ(ఎం) జండా విష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా మారి, ప్రజాసంక్షేమాన్ని మరి చాయని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆనాటి ఎర్రజెండా ఆధ్వర్యంలో జరిగిన పోరాట స్ఫూర్తిని వివరించారు. ఎర్ర జండా నాయకత్వాన 10వేల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. ఆ ఉద్యమంలో నాలుగువేల మంది అమరులయ్యారు అని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కట్టబెడుతూ దేశ సార్వభౌమత్వాన్ని బీజేపీ ప్రభుత్వం తాకట్టు పెడుతుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, పేదల నడ్డి విరిచిందని దుయ్య బట్టారు.రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పి. అంజయ్య, పి బ్రహ్మయ్య, పొలంపల్లి నరసింహా, నానక్‌నగర్ సర్పంచ్ పెద్దయ్య, నాయ కులు వినోద్ కుమార్, సత్యనారాయణ, లాజర్, జంగయ్య, నందీశ్వర్ తదితరులు పాల్గొన్నారు
చిన్న తుండ్లలో :
మండల పరిధిలోని చిన్న తుండ్ల లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు ఎర్రజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు రూపేందర్ తదితరులు పాల్గొన్నారు.