Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ రాజిరెడ్డి
నవతెలంగాణ-దోమ
పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు సకాలంలో పౌష్ఠికహారం అందించి, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం దోమ మండల కేంద్రంలో హరిజనవాడలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పోషక మాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులు విటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్న వివిధ రకాల పోషకాహారం, వైద్యులు సూచించిన మాత్రలు వేసుకోవాలన్నారు. వంట చేసే వేళ, పిల్లలకు తినిపించే వేళ, భోజనానికి ముందు, మలవిసర్జన చేసిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టాలన్నారు. బిడ్డకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు పట్టాలన్నారు. పిల్లలకు తప్పనిసరిగా ఐదేండ్ల వరకు టీకా వేయించాలన్నా రు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బంగ్లా అనితయాదయ్య గౌడ్, అంగన్వాడీ టీచర్స్ నిర్మల, మల్లమ్మ, పాఠశాల హెచ్ఎం రమేష్‌కుమార్, గర్భిణులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.