Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలపై
ఫ్రీజింగ్ ఎత్తి వేయాలి
- సీఐటీయూ మండల కన్వీనర్ పొచమొని కృష్ణ
నవతెలంగాణ-మంచాల
గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలపై ఫ్రీజింగ్ ఎత్తివేసి, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీనర్ పొచమొని కృష్ణ ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం ఎస్టీఓ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల వేతనాలు సకాలంలో ఇవ్వాలన్నా రు. ఈ కార్యక్రమంలో కార్మికులు గ్యార పాండు, నోముల జంగయ్య, శంకరయ్య, కాజా పాషా, దూసరి భాస్కర్, జంగయ్య,గాలాయ్య, నరసింహ, వెంకటయ్య, అర్జున్, సాలమ, జంగంమ కలమ్మ, తదితరులు పాల్గొన్నారు.