Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్
నవతెలంగాణ-తాండూరు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అమరవీరు ల ఆశయాలను సాధిస్తామని ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాసు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. 1946 నుంచి 1951 సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందన్నారు. ఆనాడు ఉన్నటువంటి నైజాం ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న భూస్వాములు పటేల్, పట్వారీలు వ్యతిరేకంగా ప్రజలు వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయుధ పోరాటం నిర్వహించినట్టు తెలిపారు. సాయుధ పోరాటం ద్వారానే తెలంగాణకు నైజాం నుంచి విముక్తి లభించిందన్నారు. కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలు ఆనాటి పోరాటాన్ని మరో రకంగా చూపెట్టడానికి చరిత్రను వక్రీకరించే ప్రయ త్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవంగా ఆనాడు ఉన్నటువంటి ప్రజలు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజావ్యతిరేక విధానాలకు ఆనాటి నైజాం ప్రభుత్వ పరిపాలన బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు ప్రకాష్, గణేష్ ,రవి, శ్రీనివాస్ డివైఎఫ్ఐ డివిజన్ నాయకులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.