Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య
నవతెలంగాణ-పరిగి
తెలంగాణ రైతంగా పోరాటాన్ని బీజేపీ వక్రీకరించి మతం రంగు పులిమి సొమ్ము చేసుకోవడం దుర్మార్గం అని సీపీఐ(ఎం) కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య అన్నారు. వీరతెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పరిగి పట్టణ కేం ద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యంలో జరిగిన పోరాట ఫలితంగా నిజాం నిరంకుశ పాలనను అంతంచేసి 10లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీని చేసినట్టు తెలిపారు. పోరాట పలితమే రక్షిత కౌలుదర్ చట్టం, బుధన్ చట్టం, సిలింగ్ చట్టం, భూ పరిమిత చట్టం వంటి అనేక భూ చట్టాలు వచ్చినట్టు తెలిపారు. నైజం రజాకారులకు, దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తే, బీజేపీ వాళ్ళు మాత్రం నిజాం ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణకు విముక్తి కల్పించామని మత విద్వేషాలు రెచ్చగేట్టెందుకు తెలంగాణ విలీనం దినంను బీజేపీ వాళ్ళు ఉపయోగించుకోవడం దుర్మార్గం అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు హబీబ్, శ్రీనివాస్, బసిరెడ్డి, రమేష్, రమేష్, శీను, నర్సింలు, వెంకటయ్య, అసిఫ్, నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.