Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చల్లా వంశీచంద్‌రెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
ఉన్నత విద్యను అభ్యసించిన యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధితో ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఆమనగల్ పట్టణంలో పోలేపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాంరెడ్డి చికెన్ సెంటర్ ను శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించిన యువకులు తమకు ఇష్టమైన వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకుని తోటివారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్‌నాయక్, వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, జెడ్పీటీసీ నేనావత్ అనురాధ పత్య నాయక్, ఎంపీటీసీ దోనాదుల కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ దోనాదుల సత్యం, డైరెక్టర్ చేగూరి వెంకటేష్, మాజీ జెడ్పీటీసీ కండె హరిప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మండ్లి రాములు, నాయకులు పాపిశెట్టి రాము, అప్పం శ్రీను, సయ్యద్ ఖలీల్, సుండూరి శేఖర్, బైకని శ్రీశైలం యాదవ్, కష్ణ నాయక్, వస్పుల శ్రీశైలం, ఎంగలి ప్రసాద్, ఖాదర్, కరీం తదితరులు పాల్గొన్నారు.