Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్
నవతెలంగాణ-తాండూరు
ఈ నెల 27న భారత్ బంద్‌ను విజయవంతం చేయాల ని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తాండూర్ పట్టణంలోని ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అను సరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా బంద్‌కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రైతులు దేశ రాజధాని ఢిల్లీలో 305 రోజుల నుం చి ఆందోళనలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అలాగే దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచారని మంపడిపడ్డారు. అలాగే ఎల్ఐసీ, రైల్వే, విమానాశ్రయాలు మొత్తం ప్రయివేటు, కార్పొరేటు వాళ్ల చేతికి కట్టబెట్టారని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచారని తెలిపారు. విద్యుత్తు చార్జీలు విపరీతంగా పెంచారని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలో తాము అధికారంలోకి వస్తే దేశంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా అమలుపరిచిన దాఖలాలు లేవని అన్నారు. ఈనెల 27న దేశవ్యాప్త బంద్‌కు వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస ్థలు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి స్వచ్ఛందంగా బంద్ పా టించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకు లు ప్రకాష్, లాజర్, వంశీ గణేష్, మనిషా, శృతి, దస్తమ్మ రాధిక రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.