Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
టీఆర్ఎస్ శంకర్పల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడిగా వాసుదేవ్ కన్నా, పార్టీ మం డల అధ్యక్షుడిగా కావలి గోపాల్, మం డల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ యూత్ అధ్యక్షుడిగా పాండు రంగారెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షులు గా రాఘవేందర్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు ఇంద్ర సేనారెడ్డి, యూత్ సెక్రటరీగా నరేందర్‌రెడ్డిలను ఎన్నుకున్నా రు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆదేశాలతో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మిప్రవీణ్‌కుమార్, ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి సమక్షంలో ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు స్థానిక అతిథి గృహంలో శుక్రవారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే యాదయ్యకు వారు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని పటిష్ట పరిచేందుకు ఎల్లవేళలా కృషి చే స్తామన్నారు. మున్సిపల్, మండల పరిధిలోని యువకులు, అందరినీ టీఆర్ఎస్ వైపునకు ఆకర్షితులయ్యేలా కార్యక్ర మాలు రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్, జడ్పీటీసీ గోవిం దమ్మగోపాల్రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.