Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సన్నిహిత సంబంధాలు కలిసొస్తాయనే విశ్వాసం
నవతెలంగాణ - శంషాబాద్
టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్య క్ష రేసులో పార్టీ శంషాబాద్ మండల అధ్యక్షుడు కె. చంద్రారెడ్డి ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వికారా బాద్‌కు చెందిన నాగేందర్‌గౌడ్ స్వ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కొన సాగారు. ఆ తర్వాత జరిగిన రాజకీ య పరిణామాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించలేదు. పార్టీ బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేతో నడిపిస్తూ వచ్చారు. గ్రామస్థాయి మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ నియోజకవర్గం జిల్లా అధ్యక్ష పదవులను మాత్రం భర్తీ చేయలేదు. ఇటీవల రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు దూసుకుపోతున్న తరుణంలో టీఆర్ఎస్ సంస్థాగతంగా బలోపేతం కావడానికి నిర్ణయించింది. ము ఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. నెల క్రితం నుంచి టీఆర్ ఎస్ గ్రామ కమిటీలను నియమించింది. మండల జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు కసరత్తు చేస్తున్నది. ఇందులో భా గంగా రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. జిల్లాల పునర్విభజన అనంతరం రం గారెడ్డి జిల్లాకు టీఆర్ఎస్ అధ్యక్ష స్థానం భర్తీ చేయలేదు. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం జిల్లా కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొంతమంది నాయకులు జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష రేసులో ఉన్నారు. ఇందులో శంకర్‌పల్లికి చెందిన పత్తేపురం వెంకట్ రెడ్డి, మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళారంకు చెందిన కొంపల్లి అనంతరెడ్డి, శంషాబాద్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కె.చంద్రారెడ్డి, ఇబ్రహీం పట్నంకు చెందిన క్యామ మల్లేష్ అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్నారు. వీళ్ళ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తె లుస్తున్నది. శంషాబాద్‌కు చెందిన చంద్రారెడ్డి జిల్లా అధ్యక్షు లు రేసులో ఉండి పదవిపై సంపూర్ణ ఆశలు పెట్టుకున్నారు. 30 ఏండ్ల రాజకీయ అనుభవం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఆశీస్సులు, ప్రజాప్రతినిధులతో సంబంధాలు కలిసొస్తాయని విశ్వాసంగా ఉన్నారు. తెలుగుదేశంలో రెండుసార్లు మండల అధ్యక్షుడిగా పని చేశారు. టీఆర్ఎస్ పార్టీలో రెండు పర్యాయాలుగా పార్టీ మండలం అధ్యక్షుడిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజేంద్రన గర్ శాసనసభ్యులు టి.ప్రకాష్‌గౌడ్ విశ్వాస పాత్రునిగా అత్యంత సన్నిహితు డిగా 20 సంవత్సరాలుగా ఆయన వెన్నంటి ఉన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలుపు కోసం అహర్నిశలు శ్రమించా రు. మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను, 90 శాతానికి పైగా గ్రామ పంచాయతీలను టీఆర్ఎస్ గెలుచు కునేందుకు విశేష కృషి చేశారు. ఎమ్మెల్యే టీడీపీ నుంచి అధికార టీఆర్ఎస్లో చేరినప్పుడు ఒక్క పంచాయతీ కూడా టీఆర్ఎస్ ఖాతాలో లేదు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన వెంటనే ఆయన అనుచ రుడిగా టీడీపీని వీడీ టీిఆర్‌ఎస్ పార్టీలో ఆయన చేరారు. చేరిన వెంటనే అప్పటికే దీనావస్థలో ఉన్న టీఆర్ఎస్ పుంజు కోవడానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రయత్నాలు చేశారు. మండలంలో ఆయనకు ఉన్న సంబంధాలతో ప్రతిపక్ష పార్టీల సర్పంచ్‌లు టీఆర్ఎస్లో పార్టీలో చేరేలా కృషి చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అసలు ప్రతిపక్ష పార్టీల ఉనికే ప్రశ్నార్థకమైంది. దా దాపు మండలంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలకు చెంది న సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, రాజకీయ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఘనత సాధించడంలో సమన్వయం చేయడంలో చంద్రారెడ్డి ప్రత్యేక కృషి చేశారు. ఏ బహిరంగ సభ నిర్వహించిన అధికార కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు సమన్వయం చేయడంలో కార్యకర్తలు నడిపించడంతో మండలంలో వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ ఎమ్మెల్సీ, జడ్పీ చైర్పర్సన్ కూడా మంచి సంబంధాలను కొనసాగించడం వల్ల ఆయనకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పదవి వస్తుందని ధీమాతో ఉన్నారు. మంచి వాగ్దాటి కలిగిన నేతగా మండలంలో మంచి పేరుంది. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు వస్తే రాజకీయంగా ఆయనకు ఉన్న అపార అనుభవం పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడు తుందని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయనకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి వచ్చే అవకాశం కూడా మెండుగా ఉన్నట్టు తెలుస్తున్నది.