Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా విద్యా సంస్థలు ప్రారంభిస్తున్నమని నమ్మబలికే కార్పొరేటు విద్యాసంస్థల యాజమాన్యాలు.. ధనార్జనే ప్రధాన ధ్యేయంగా విద్యార్థుల తల్లిండ్రుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఫీజులు చెల్లించ లేని విద్యార్థుల పరిస్థితి '' కుడితిలో పడ్డ ఎలుకలా'' మారింది. ఉన్నత చదువులకు వెళ్లేందుకు సర్టిఫికేట్లు లేక...ఫీజులు చెల్లించ లేక విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా నేపథ్యంలో ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం జీవో 46ను జారీ చేసినప్పటికీ... ఆ జీవో కార్పొరేట్ యాజమాన్యాలు చెల్లని కాగితంగానే పరిగణిస్తూ... తమ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంతా జరుగుతున్నా ప్రభుత్వాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
- నవతెలంగాణ, రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎడ్యుకేషన్ హబ్‌గా పేరొందిం ది. జిల్లాలో సుమారు 184 కార్పొరేటు విద్యా సంస్థలు ఉన్న ట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో దాదాపు 20 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది 2020-21 మొత్తం ప్రత్యేక తరగతులు నిర్వహిం చకుండా ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించారు. కరోనాతో యావత్ ప్రజానీకం జీవన స్థితిగతులు తలకిం దులు కావడం... అనేక కుటుంబాలు పూట గడవని పరిస్థితి లో రోడ్డున్న పడ్డాయి. దీంతో విద్యా ర్థుల తల్లిండ్రులను ఫీజుల వసూళ్లతో ఇబ్బందులు పెట్టొం దని..విద్యాసంస్థల యాజమాన్యాలకు 46 జీవో ద్వారా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఏ మేరకు ట్యూషన్ ఫీ జు వసూలు చేయా లన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం తో కార్పొరేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ ఇష్టా నుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.
ఫీజులు చెల్లిస్తేనే మెమోలు...
ఇంటర్ సెకండ్ ఈయర్ పూర్తయిన విద్యార్థులను కా ర్పొరేటు విద్యాసంస్థలు ముక్కు పిండి వంద శాతం ఫీజులు వసూలు చేస్తున్నాయి. నారాయణ, చైతన్యా, శ్రీ గాయత్రి కార్పొరేట్ సంస్థలు అడ్మిషన్ సమయంలో మాట్లాడిన ఫీజు కు మరో రూ.50 వేలు అదనంగా వసూలు చేస్తున్నాయి. ఇది ఎక్కడి ఫీజు అని తల్లిదండ్రులు అడిగితే ఐఐటీ మెటిరి యల్ ఫీజు రూ.15 వేలు, ల్యాబ్ ఫీజు రూ. 18 వేలు, డెవలప్మెంట్ ఫీజు రూ. 6 వేలు, ఆన్లైన్ యాప్‌కు రూ.8 వేల అంటూ లెక్క చెబుతూ అందిన కాడికి దోచుకుంటు న్నాయి. 30 శాతం స్టాఫ్‌తోనే ఆన్లైన్ క్లాసులు నిర్వహిం చారు. ఆయా విద్యాసంస్థలు విద్యార్థుల విద్యాబోధనలపై ఖర్చు చేసింది ఏమీ లేదు.. అయినప్పటికీ ఫీజులో మాత్రం ఏలాంటి మినహాయింపు లేకుండా వంద శాతం చెల్లించా ల్సిందేనట్టు విద్యాసంస్థలు ఒత్తిడి చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వందశాతం ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్ ఇస్తారంటా
నాది నారాయణ జూనియర్ కాలేజీ కొత్తపేట బ్రాంచ ్లో ఇంటర్ సెకండ్ ఈయర్ పూర్తయింది. ఈ నెల 24 డిగ్రీ అడ్మిషన్ కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉన్నది. ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీలో అడిగితే వంద శాతం ఫీజు చెల్లించేస్తేనే సర్టిఫికేట్లు ఇస్తాం అంటూ బెదిరిస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ ఫీజు వంద శాతం కట్టాను. సెకండియర్ ఫీజు 75 శాతానికి రూ. 7వేలు చెల్లించాలి.. ఆ రూ. 7వేలు చెల్లిస్తా సర్టిఫికెట్లు ఇవ్వమంటే మొత్తం ఫీజు తీసుకోని వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారు.
- అనిల్ కుమార్, ఇంటర్ విద్యార్థి
కార్పొరేట్ విద్యాసంస్థల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
అదనపు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న కార్పొరేట్ విద్యాసం స్థల యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కోవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు నిర్వహించిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఫీజులు వసూలు చేయాలి. తమ ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించకపోతే భవిష్యత్‌లో విద్యార్థులను, వివిధ విద్యార్థి సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున్న ఉద్యమాలు చేపడుతాం.
- శంకర్, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి