Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
మండలంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని గోపులారంలో గ్రామ పంచాయతీ నిధులు రూ.20లక్షలతో సీసీరోడ్డు పనులకు జడ్పీటీసీ గోవిందమ్మగోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పొడుగుశ్రీనివాస్తో కలసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని శంకర్పల్లి మం డలంను ఆదర్శ మండలంగా తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తా నన్నారు. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గోపులారం గ్రామాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. జిల్లా పరిషత్ విధులు రూ.15 లక్షలతో అండర్ డ్రయినేజీ పనులు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు సామయ్య, గ్రామ పంచాయతీ పాలక వర్గం, శివలీల శ్రీనివాస్, సరిత సత్యనారాయణ, వెంకటరెడ్డి, శారద రాంచందర్, రమేష్, గ్రామ సెక్రటరీ, సుదర్శన్ కో-ఆప్షన్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, టీఆర్ఎస్ ప్రెసిడెంట్, రాఘవేందర్, యువకులు పాల్గొన్నారు.