Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుల్కచర్ల
సీజన్లో పంటలపై వచ్చే తెగులపైన రైతులు అప్రమత్తంగా ఉండా లని వ్యవసాయ విస్తరణ అధికారి అనిత, ఎంపీటీసీ శంకర్ అన్నారు. శుక్రవారం చౌడపూర్ మండలం కేంద్రంలోని రైతు వేదికలో రైతుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పంటలపై చీడపురుగులు సోకినప్పుడు వాటి నియంత్రణకు తగిన మందులతో పిచికారి చేయించాలన్నారు. అదే విధంగా వేసవికాలంలో భూముల సారవంతమును బట్టి తగిన పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు యాదయ్య, ఉపసర్పంచ్ శివకుమార్, డైరెక్టర్లు కృష్ణయ్య, రమేష్, వార్డు సభ్యులు గౌస్, మాజీ సర్పంచ్ పాల నర్సింలు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.