Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుల్కచర్ల
ఇంటింటికీి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ సబ్ సెంటర్లలో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కె.జానకి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం అందిస్తున్న ఇంటింటికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో సర్వే చేసి అర్హులందరికీ వ్యాక్సిన్ అందించేలా చర్యలు చేపట్టాలని మండల స్థాయి అధికారులకు ఆదేశించారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు వచ్చిన వారికి సెంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి కావల్సిన వసతులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నాగవేణి, గ్రామ సర్పంచి లక్ష్మీ ఆనంద్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.