Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాండూరు అగ్రికల్చర్ ఏడీఏ శంకర్ రాథోడ్
నవతెలంగాణ- యాలాల
రైతులు యాసంగిలో పంట మార్పిడి సాధించి, తక్కువ నీటి వినియోగంలో సాగయ్యే పంటలపై దృ ష్టి సారించాలని తాండూరు అగ్రికల్చర్ ఏడీఏ శంకర్ రాథోడ్. ఏఆర్సీ శాస్త్రవేత్త సందీప్ అన్నారు. మండలంలోని రాస్నం గ్రామపంచాయతీ రైతు వేదిక భవనంలో క్లస్టర్ పరిధి రైతులందరికీ పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరి పంట సాగును తగ్గించాలన్నారు. వరి పంట సాగు ఎక్కువ నీటితో పాటు పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుందని సూచించారు. వారికి బదులు వేరుశెనగ, నల్ల, తెల్ల, కుసుమలు, నువ్వులు, జొన్నలు, పెసర, మినుములు లాంటి పంటలు సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కావలి సురేఖ, ఏఈఓ సాంసన్, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ రైతు సమితి కో-ఆర్డినేటర్లు, రైతులు, పాల్గొన్నారు.