Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి బి.సాయిబాబు
నవతెలంగాణ-కొత్తూరు
దేశవ్యాప్తంగా పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి వారి కనీస వేతనాలను రూ.21వేలు అమలు చేయాలని సీఐటీయూ సహాయ కార్యదర్శి బి. సాయిబాబు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల ఒక రోజు సమ్మెలో భాగంగా శుక్రవారం ఆయన ఆశా కార్యకర్తలతో కలసి మండల రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, వీఓఏ, కస్తూర్బ, చైల్డ్ లేబర్, మెడికల్ హెల్త్, విద్యారంగంలో పనిచేస్తున్న వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 21 వేలు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల విస్మరిస్తున్నాయని ఆయన విమర్శించారు. అనంతరం తహసీల్దార్ రాములు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశాలు అనిత, నవనిత, మంజుల, వసంత, జంగిర్ బి, సుజాత, రాజేశ్వరి, వసంత, బుజ్జి, కమల, వసంత, తదితరులు పాల్గొన్నారు.