Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదనపు కలెక్టర్ మోతిలాల్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో నవంబర్ మొదటి వారం నుంచి పత్తి కొను గోలు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో రెండు లక్షల రెండు వేల క్వింటాళ్ల పత్తి మార్కెట్కు వచ్చే అవకాశముందన్నారు. రంగు మారని, తేమ లేకుండా ఉన్న నాణ్యమైన పత్తికి మద్దతు ధర రూ.6,025 లభిస్తుం దన్నారు. కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా వారు అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉం టారని తెలిపారు. జిల్లాలో మొత్తం 10 కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులకు అన్ని మండల కేంద్రాల్లో వ్యవసాయ అధికారులు టోకెన్లు, తేదీ ఇస్తామని తెలిపారు. దాని ప్రకారం రైతులు తమ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. జిల్లాలో ప్రతిరోజూ సుమారుగా మూడు వేల క్వింటల్ల పత్తి కొనుగోలు చేస్తామని తెలిపారు. మిల్లర్లు రైతులకు తాగునీ రు, మరుగుదొడ్లు, పార్కింగ్ లాంటి సదుపాయాలు కల్పిం చాలని సూచించారు. రైతులు తప్పకుండ తమ వెంటనే ఆ ధార్, పట్టా పాస్ బుక్, బ్యాంకు పాసుబుక్ తీసుకుని రావా లన్నారు. విక్రయించిన పత్తి డబ్బులు మూడు రోజులలో రైతు ఖాతాకు నేరుగా జామ చేస్తామన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా, ట్రాఫిక్ సమస్యలు తేలేత్తకుండా స్థానిక పోలీస్ అధికారుల సహాయం పొందాలని సూచిం చారు. ఈ సమావేశంలో జిల్లా మార్కె టింగ్ అధికారి ఛాయదేవి, వ్యవసాయ శాఖ ఏడీ భారతి, సీసీఐ ప్రతినిధి రాజశేఖర్, మిల్లర్లు, మార్కెటింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.