Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్‌పై సమీక్షా సమావేశం
నవతెలంగాణ-మియాపూర్ ( గచ్చిబౌలి)
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరే ట్లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ (డబ్లూఅండ్సీీఎస్డబ్ల్యూ) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో షీ టీమ్స్, ఆపరేషన్ స్మైల్ టీమ్, ఆపరేషన్ ముస్కాన్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్ టీయూ), డయల్ 100 టీమ్స్, భరోసా, ట్రాన్స్ జెండర్స్ హెల్ప్ డెస్క్, కోర్ట్ మానిటరింగ్ సెల్, ఆర్జీఐఏ/ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ హెల్ప్ డెస్క్, అండర్ ఇన్వెస్టిగేషన్ (యూఐ) మానిటరింగ్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ రాష్ట్ర పభుత్వం, పోలీసులు మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మ హిళలు, చిన్నారుల పట్ల నేరాలు జరగకుండా ఉండాలంటే ముందస్తు ప్రణాళికలతో నివారించాలన్నారు. ఏదేని సంఘ టన జరిగినట్లైతే పోలీసులు సరైన రీతిలో స్పందించాలన్నా రు. చిన్న, చిన్న నేరాలు చేసే వారే భవిష్యత్తులో పెద్ద నేరా లకు పాల్పడే అవకాశాలున్నాయన్నారు. వీటిని అరికట్టేం దుకు ఈవ్ టీజర్ల డేటా సేకరించి విశ్లేషించి స్థానిక లా అండ్ ఆర్డర్ సిబ్బందితో కలిసి పని చేయాలన్నారు. సైబరా బాద్‌లో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేదన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే వేగంగా స్పందించడంతో పాటు బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలన్నారు. ఆకతాయిల ఆటకట్టించడంలో సిబ్బంది మూస పద్ధతులకు స్వస్తి పలికి, కొత్త వ్యూహాలను అనుసరించాలన్నారు. అవసరమైతే సిబ్బం దికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా సీపీ సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి పనితీరును తెలుసుకున్నారు. సిబ్బందికి సమస్యలుంటే తనను నేరుగా సంప్రదించినా, గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామన్నారు. సిబ్బంది ఉత్తమ పనితీరు కనబర్చాలన్నారు. అనంతరం డబ్లూ అండ్సీఎస్డబ్ల్యూ డీసీపీ అనసూయ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ పనితీరును వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, డబ్ల్యూ అండ్సీఎస్ డబ్ల్యూ ఏసీపీ కిషోర్ కుమార్, ఏహెచ్‌టీయూ ఇన్చార్జి నరహరి, ఇన్స్పెక్టర్లు సునీత, వెంకటేశం, సంతోషం, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.