Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికారాబాద్ డిపోలో అద్దె బస్సులే అధికం
ఆరు నెలల్లో ఆరు కోట్ల నష్టం
నవతెలంగాణ వికారాబాద్ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కగా ప్రయివేటీకరణ అ మలు చేస్తున్నాయి. ఆదాయంలో ఉన్న ప్రభుత్వ రంగ సం స్థలు నష్టం గ్రూప్‌లోకి నెడుతూ ప్రయివేటీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగానే నేడు తెలంగాణలో ఆర్టీసీ ప్రయివేటీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
రాబోయే నాలుగు నెలల్లో ఆర్టీసీ ప్రక్షాళన జరగకపోతే ప్రయివేటు పరం చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల హెచ్చరించారు. ఇదే విషయాన్ని మొన్న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఎండీ సజ్జనార్, ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ల కు స్పష్టం చేశారు. ఆర్టీసీని రక్షించాలనే ఉద్దేశంతోనే ప్రభు త్వం అనేకసార్లు ఆదుకుందని, ఈ ఏడాది కూడా ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద రూ.3,000 కోట్లు కేటాయించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఆర్టీసీ మనుగడ సాధ్యమవుతుందని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
వికారాబాద్ జిల్లాలో గత ఆరు నెలల పరిశీలిస్తే రూ.6 కోట్ల 20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబు తున్నారు. మరో నాలుగు నెలల్లో ఆర్టీసీని గాడిన పెట్టాలనే లక్ష్యంతో, కృతనిశ్చయంతో ముందుకెళ్లాలి. ఏ రూట్లో నష్టాలు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వంటి అంశాలపై అధ్యయనం చేసి వాటిని అమలు పరచాలని సీ ఎం ఆదేశించినట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు అందులో భాగంగానే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కరోనాతో పాటు పెరిగిన డీజిల్ ధరలు ఆర్టీసీ నష్టాలకు కారణమైనట్టు అధికారులు సీఎంకు వివరిం చారు. కార్యాలయాల్లో కూర్చుని పనిచేస్తే కుదరదు. అధికా రులు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలు తెలుసుకోవాలని అప్పుడే సంస్థ బాగుపడుతుందని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఎంతసేపు కార్యాలయంలో కూర్చుని సమన్వయం చేసుకుంటే క్షేత్రస్థాయిలో సమస్యలు ఎవరు తెలుసుకుంటారు. వాటిని ఎవరు పరిష్కరిస్తారని ఆర్టీసీ ఈడీ స్థాయి అధికారులను ఉన్నతస్థాయి అధికారులు మందలించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరును మార్చుకోవాలని హితవు పలికినట్టు సమాచారం. రాష్ట్రంలో ఉన్న 97 డిపోల్లో అన్నీ నష్టాల్లోనే కొనసాగుతు న్నాయి. వికారాబాద్ జిల్లాలో పరిగి, తాండూర్, వికారాబాద్ డిపోలు ఉన్నాయి. జిల్లా మొత్తంలో 12వందల మంది వర కు కార్మికులు పని చేస్తున్నారు. జిల్లాలో 128 ఆర్టీసీ బస్సు ఉండగా అదే స్థాయిలోలో 128 అద్దె బస్సులు ఉన్నారు. రోజుకు 85 వేల కిలోమీటర్లు ఆర్టీసీని నడపాల్సి ఉంటుంది. ఒక్క కిలో మీటర్‌కు 50 రూపాయలు రావాల్సి ఉండగా ప్రస్తుతం 30 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఇందులో విశేషం ఏమిటంటే అద్దె బస్సులు కిలోమీటర్‌కు రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం వచ్చినా రాకున్న అద్దె బస్సులకు రూ. 30 లెక్క కిలోమీటర్‌కు చెల్లించక తప్పదు. దీంతో రావాల్సిన లాభం మరింత దిగజారుతుంది. ఈ డిపోల్లో అత్యధిక నష్టాలు వస్తున్నాయి. అందుకు గల కారణాలపై నివేదికలు తయారుచేసి, వాటిని లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని యాజమాన్యం అధికారుల కు స్పష్టం చేసింది. వికారాబాద్ జిల్లా ఒకప్పుడు ఆదాయం లో ముందుండేది. గత ఆరు నెలలుగా పరిశీలిస్తే అంతకు ముందు పరిశీలిస్తే తేడాలు చాలా కనిపిస్తున్నాయి. ఆదా యంలో ఉన్న ఆర్టీసీ ఎందుకు నష్టాల్లో ఊబిలోకి దిగుతుం ది. ఎవరికి అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివే టుకు ఎక్కువగా మొగ్గు చూపుతుంది. రోజురోజుకూ నష్టా లు అవుతున్నట్టు అధికారులు ఉన్నత అధికారులకు ఇప్పటికే నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఎలాంటి ఆదేశాలు అందలేదు
ఉన్నత అధికారి నుంచి ప్రయి వేటీకరణ గురించి మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. తమ పరిధి లో ఉన్న తాండూరు, వికారాబాద్, పరిగి డిపోలు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల కన్నా అద్దె బస్సులు ఎక్కువగా ఉన్నాయి. రోజుకు సరాసరి రూ.20 రూపా యల మేర కిలోమీటర్లు నష్టపోతున్నాం. నష్టాలు ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు తయారు చేస్తున్నాం.
- రమేష్ , డీవీఎం