Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని రాకొండ గ్రామంలో పంటలను అంచనా వేసినట్టు మండల గణాంక అధికారి సందీప్ రెడ్డి తెలిపారు. గ్రామంలో సర్వే 20లో పంటల పరిశీలన చేసి పంట నమోదు వివరాలను పరిశీలించారు. ముందస్తు అం చనా రూపొందించారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వంనకు సమర్పించడానికి ఈ డేటా ఉపయోగప డుతుందని ఆయన తెలిపారు. అర్థ గణంక శాఖ రూపొందించిన సర్వే టూ యాప్ ద్వారా ఆధునిక పద్ధతుల్లో పంట వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కావ్య, వీఆర్ఏ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.