Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీపీ జయమ్మ, జెడ్పిటిసి తన్వి రాజు
గర్భిణీలకు శ్రీమంతాలు చేయించిన జడ్పీటీసీ
నవతెలంగాణ-శంషాబాద్
గర్భిణులు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తకుం డా సమతుల ఆహారం తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని శంషాబాద్ ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్వి రాజు అన్నారు. సోమవారం శంషాబాద్ మండల పరిధిలోని ఘాన్సీమియాగుడలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ అనురాధ ఆధ్వర్యంలో శ్రీమంతాలు అన్నప్రాసన అక్షరాభ్యాస కార్యక్ర మం నిర్వహించారు. జడ్పీటీఈ తన్విరాజు తన సొంత ఖర్చు లతో శ్రీమంతాలు చేయించారు. గర్భిణీలకు ఆహారనియ మాలు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి తెలియజేశారు. చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా లభించే ఆహారం, సలహాలు సూచనలు నియమ ని బంధనలు గర్భిణులు, బాలింతలు తప్పకుండా పాటించాల న్నారు. గ్రామ సర్పంచ్ సిహెచ్. దేవిక జగన్ మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లలో గర్భిణులు బాలింతలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. పాలమాకుల సెక్టార్ ఐసీడీఎస్ సూపర్వైజర్ అనురాధ మాట్లాడుతూ పుట్టిన పిల్లలకు ముర్రుపాలు పట్టించడంతో పాటు రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సిహెచ్ శ్రీకాంత్ గౌడ్, పాఠశాల హెచ్ఎం, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.