Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ పరంగా అదుకోవాలి
కాంగ్రెస్ యువనేత జ్ఞాన్అభిలాష్
నవతెలంగాణ-గండిపేట్
భారీ వర్షాలకు ఇళ్లు కూలి వీధిన పడిన బాధితుల పట్ల కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం చేస్తుందని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ యువనేత బొర్రా జ్ఞాన్ అభిలాష్ ఆరోపించారు. సోమవారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పాత బండ్లగూడ గ్రామంలో కురిసిన వర్షాలకు పాత ఇళ్లు కూలిపోయాయని తెలిపారు. ఇళ్లు కూలిపోయి వీధి పడి రెండు రోజులు అవుతున్న కార్పొరేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కనీసం వారిని పరమర్శించిన జాడ లేదన్నారు. ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధి చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు బాధితులను ఆదుకోవడం లేదన్నారు. ఇండ్లు కూలి పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ యువ నాయకులు నరేష్, రవి, సురేష్ దీపక్, రవికాంత్, రాజేష్, బాబా, తదితరులు పాల్గొన్నారు.