Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ జిల్లాలోని వర్ష పరిస్థితులు, పెద్దేముల్ మండలం కందనెల్లి తాండాలో చోటు చేసుకున్న ఘటనపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిరెడ్డి ఫోన్లో కలెక్టర్ నిఖిలతో మాట్లాడారు. అకస్మాత్తుగా గాలి, వానతో ప్రజలు ఆందోళనకు గురి అయ్యారని, అధికారులు వెళ్లి పరిస్థితి ని తెలుసుకొని, ప్రజల్లో ధైర్యం కల్పించాలని మంత్రి అన్నారు. జిల్లాలోని వాగులు, కాలువలు, చెరువుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు విద్యుత్, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో సమన్వయం చేసుకోవాలని, ప్రమాదభరిత ప్రాంతాల్లో గస్తీ పెట్టాలని మంత్రి సూచించారు.