Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీపీ వై. రవీందర్ యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
మత్స్యకారుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎంపీపీ వై రవీందర్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రభుత్వం ఉచితంగా అంది స్తున్న చేపపిల్లలను మత్స్యకారులకు ఆయన అందజేశారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మత్స్యకారులు ఆంజనేయులు, సుధాకర్, లక్ష్మణ్, రమేష్, కృష్ణయ్య, పర్వతాలు, వెంకటేష్, కృష్ణ, సతీష్, కేశంపేట సర్పంచ్ వెంకట్‌రెడ్డి, షాద్‌నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, దేవుజనాయక్, శేఖర్ పంతులు, దశరథం, మల్లేష్, వెంకట్ రెడ్డి, మురళీమోహన్, ఫైజన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.