Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద్ పటేల్
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
రాష్ట్ర ముఖ్యమంత్రి వికారాబాద్ పర్యటన సందర్భంగా అనంతగిరిని తెలంగాణ ఊటీగా అభివర్ణిం చారని బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ గుర్తు చేశారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సం దర్భంగా అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. అనంతగిరిలో పర్యావరణాన్ని సంరక్షించాల్సిన బాధ్యత స్థానికులదేనని, ఇక్కడికి ప్రతి శని, ఆదివారాల్లో పర్యాటకులు పెద్దఎత్తున ప్రకృతిని ఆస్వాదించేందుకు, అనంత పద్మనాభ స్వామి దర్శనానికి వస్తుంటారని తెలిపారు. మునుముందు ఈ ప్రాంతాన్ని ప ర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా తీర్చి దిద్దాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలె క్టర్ చంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని రాబోయే కాలంలో జిల్లాను పర్యాటక కేంద్రంగా చేసేందుకు ప్రణాళికలు రూ పొందిస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు అనంతగిరి అతి సమీపంగా ఉన్నందున చాలా మంది పర్యాటకులు ఇక్కడికి ట్రాకింగ్, దైవ దర్శనంతో పాటు ప్రకృతిని ఆస్వాదించడానికి వస్తుంటారని తెలిపారు. అడవి ప్రాంతంలో లక్షల మొక్కలు నాటడం జరిగిందని, ఔషద మొక్కలు కూడా ఉన్నందున చెట్లు నరకకుండ ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాల న్నారు. పాఠశాల విద్యార్థులు, సాంస్కృతిక సారధి కళాకా రులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పర్యాటక రంగం ఆవశ్యకతపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హన్మంత్ రావు, జిల్లా విద్యా శాఖ అధికారిని రేణుకదేవి, జిల్లా అటవీ శాఖ అధికారి వేణుమాధవ్, సంక్షేమ శాఖల అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.